పెంట్లవెల్లి మండలంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
(జనం సాక్షి ):పెంట్లవెల్లి మండలం లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.ప్రతి బిజెపి నాయకులకు కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.ములే వెంకటేష్ బిజెపి జిల్లా కౌన్సిల్ నెంబరు మాట్లాడుతూ.భారతీయ జనతా పార్టీ ఏర్పడి నేటికీ 46 వసంతాలు పూర్తిచేసుకుని 47 వసంతంలోకి అడిగేడుతున్న శుభ సందర్భంగా కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా పేరుపేరునా శుభాకాంక్షలు.
పార్టీ ఏర్పడడానికి అంత్యోదయ అనే ఒక మూల సిద్ధాంతంతో 1980 వ సంవత్సరంలో ఏర్పడి నేడు దేశమంతా కూడా చిట్టచివరి వ్యక్తికి ప్రభుత్వ ఫలాలు అందాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఏర్పడింది.దానికి అనుగుణంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు పేద ప్రజల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్న గొప్ప ప్రజాస్వామ్య దేశం భారతదేశం.ఈ గొప్ప దేశం లో భారతీయ జనతా పార్టీ తన వంతు పాత్రగా పేద ప్రజలకు ఎల్లప్పుడూ సేవ చేయాలని సంకల్పంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకు సాగుతూ ఉంది.అని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు భరత్ చంద్ర మాధవస్వామి నగర్ సర్పంచి కంటే వెంకటస్వామి గారు పెంట్ల వెల్లి మండల ప్రధాన కార్యదర్శి కొత్తపేట కురుమూర్తి. వార్డ్ మెంబర్స్ కుమారు,రామస్వామి, అశోక్ కార్యకర్తలు శివరాజు, శివ,కృష్ణయ్య bijje కృష్ణ, బోడ శివకుమార్, బెక్యం కృష్ణయ్య, ముత్తు, రవికుమార్L, ఎల్ల స్వామి గారు మొదలైన వారు పాల్గొన్నారు


