Sunday, 8 November 2026

వార్తలు

జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్‌

జార్ఖండ్‌ : జార్ఖండ్‌లోని ఛత్రా జిల్లా కుందా ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మవోయిస్టు అగ్రనేత అజయ్‌గుంజూ అలియాస్‌ పరాస్‌ జీ మృతి చేందినట్లు సమాచారం. రాత్రి నుంచి ఈ ఎన్‌కౌంటర్‌ కొనసాగుతుంది.

మూత పడిన ప్రభుత్వ పాఠశాల తెరిపించిన గ్రామస్తులు

ధర్మారం : కరీంనగర్‌ జిల్లా ధర్మారం మండలంలోని శాయంపేట నుంచి విద్యార్థులను ప్రైవేటు పాఠశాలలకు పంపబోమని తల్లిదండ్రులు తీర్మానించారు. కొన్నేళ్లుగా విద్యార్థులు ప్రైవేటు పాఠశాలకు వేళ్లడంతో గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకే పంపుతామని తీర్మానం చేసి ఊళ్లోకి వచ్చిన…

గాలి బెయిల్‌ కోసం 100 కోట్లకూ వెనకాడలేదు

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ వ్యవహారం రోజుకో మలుపులు తిరుగుతుంది. తవ్విన కొద్ది కొత్త కొత్త విషయాలు వెలుగులోకొస్తున్నాయి. తాజాగా మొన్న అరెస్టెన జడ్జి లక్ష్మినరసింహరావు సీబీఐ విచారణలో కళ్లు బైర్లుగమ్మె  నిజాలు వెల్లడించారు. గాలికి బెయిలిప్పిస్తే వంద కోట్ల…

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జశ్వంత్‌సింగ్‌ నామినేషన్‌

ఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఎన్డీయే అభ్యర్థిగా భాజపా నేత జశ్వంత్‌సింగ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. యూపీఏ అభ్యర్థి హమీద్‌ అన్సారీ బుధవారం నామినేషన్‌ దాఖలు చేసిన సంగతి విదితమే.

యూపిఏలోనే కొనసాగుతాం : ప్రపుల్‌ పటేల్‌

న్యూఢిల్లీ : తాము ఎప్పటినుంచో యూపీఏలో భాగసామ్యపక్షంలో ఉన్నామని ఇకాముందు కూడా అలాగే కొనసాగతామని  ఎన్సిపీ నేత కేంద్రమంత్రి ప్రపుల్‌ పటేల్‌ తెలిపారు. ఢిల్లీలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ తమపై అనవసరంగా దుష్ప్రచారం జరుగుతుందని అన్నారు.…

నిమ్మగడ్డ బెయిల్‌ పిటీషన్‌పై తీర్పు వాయిదా

హైదరాబాద్‌: ఎమ్మార్‌ప్రాపర్టీస్‌ కేసులో రిమాండ్‌లో ఉన్న నిమ్మగడ్డ వరప్రసాద్‌ బెయిల్‌ కోసం పిటీషన్‌ వేశారు. నిమ్మగడ్డ బెయిల్‌ పిటీషన్‌పై కోర్టు విచారణను ఈ నెల 30కి వాయిదా పడింది.

సెల్‌ టవర్‌ ఎక్కిన టీఆర్‌ఎస్వీ విద్యార్థులు

హైదరాబాద్‌:కూకట్‌పల్లిలోని ఓ  సెల్‌టవర్‌పైకి ఎక్కిన టీఆర్‌ఎస్వీ విద్యార్థులు నిరసన నినాదాలు చేశారు. సిరిసిల్లలో విజయమ్మ ఒక్క రోజు దీక్షకు నిరసనగా వారు ఈ నిరసనకు దిగారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పకుండా విజయమ్మ సిరిసిల్లలో పర్యటించేది లేదని వారు…

రైల్వేస్టేషన్లో మృతదేహం లభ్యం

విశాఖపట్నం : స్థానిక రైల్వేస్టేషన్లో ప్లాస్టిక్‌ సంచుల్లో లభ్యమైన మృతదేహం కేసులో పోలిసులు దర్యాప్తు ప్రారభించారు. రెండు సంచుల్లో  11 ముక్కలుగా దొరికిన అవయవభాగాలపై దర్యాప్తు చేపట్టారు. మృతుడు ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతలలోని రాయపూర్‌ ప్రాంతవాసిగా భావిస్తున్నారు. దీంతో ఈ…

నిజామాబాద్‌ ఎమ్మెల్సీగా కాంగ్రెస్‌ గెలిచినట్లు హైకోర్టు తీర్పు

హైదరాబాద్‌: నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గెలిచినట్లు హైకోర్టు ఈరోజు తీర్పు ఇచ్చింది. గతంలో అక్కడ ఎమ్మెల్సీగా తెరాస అభ్యర్థి నర్సారెడ్డి గెలిచారు. అయితే ఆ ఎన్నిక చెల్లదని తిరిగి లెక్కింపు జరపాలని కాంగ్రెస్‌ అభ్యర్థి…

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మార్కెట్లో ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.29,500 పలికింది. 22   క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 28,600గా ఉంది. కిలో వెండి ధర 52,250 రూపాయలు ఉంది.