Sunday, 8 November 2026

వార్తలు

ఈరోజు అమరుడు యాదిరెడ్డి ప్రథమ వర్థంతి

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును కోరుతు పార్లమెంట్‌ సాక్షిగా ఆత్మహత్య చేసుకున్న యాదిరెడ్డి ప్రథమ వర్థింతి సంస్మరణసభ ఈ రోజు తెలంగాణ భవన్‌లో జరగనుంది. ఈ కార్యక్రమానికి ఈటెల రాజెందర్‌, కవిత తదితరులు పాల్గొననున్నారు.

మోనోరైల్‌ వంతెన కూలి ఒకరి మృతి

ముంబయి: ముంబయిలోని వడాలా వద్ద శాంతినగర్‌లో ఈస్ట్రన్‌ రైల్వేకు చెందిన ఓ మోనోరైల్‌ వంతెన కూలి ఒకరి మృతి చెందారు. వంతెనలోని ఓ భాగం అకస్మాత్తుగా కూలి కింద ప్రయాణిస్తున్న వాహనాలపై పడింది. దీంతో దానికింద ఉన్న ఓ…

కృష్ణపట్నంలో భారీగా పోలీసుల మొహరింపు

నెల్లూరు: కృష్ణపట్నం రేవును ఈరోజు ఉదయం 9:30గంటలకు ముట్టడించనున్నట్లు మత్య్సకారులు ప్రకటించడంతో ఆ ప్రాంతంలోనూ, పరిసరాల్లోనూ భారీగా పోలీసులను మొహరించారు. అక్కడంతటా 144సెక్షణ్‌ విధించారు. పోర్టు నిర్మాణం వల్ల నిర్వాసితులైన నాలుగు గ్రామాల ప్రజలు పోర్టును ముట్టడించనున్నారు. తమకు…

ఘోర రోడ్డుప్రమాదంలో 14 మంది మృతి

ముజఫర్‌నగర్‌: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో 14 మంది మృతి చెందగా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. బిలాన్‌పూర్‌ గ్రామంలో చనిపోయిన ఓ మహిళ అంత్యక్రియల నిమిత్తం బంధువులు స్మశానానికి వెళ్లి ట్రాక్టర్‌లో…

తిరుమలలో భక్తులరద్దీ సాధారణం

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి దర్శనం కోసం 10కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 7గంటల సమయంపడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2గంటల సమయం పడుతోంది.

వుడా భూ కుంభకోణంలో ప్రాథమిక విచారణ: సీబీఐ జేడీ

విశాఖపట్న: వుడా భూ కుంభకోణం కేసులో ప్రాథమిక విచారణ జరుగుతోందని సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. అయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ విశాఖ సీబీఐ కోర్టులో మౌలిక సదుపాయాలు, కేసులను సమీక్షించేందుకు ఇక్కడకు వచ్చానన్నారు.

సింగూర్‌ ప్రజెక్టులో పెరిగిన నీటిమట్టం

పుల్కల్‌: గత మూడురోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలతో సింగూరు ప్రజెక్టులో 3, 314క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరిందని ప్రాజెక్టు డిప్యూటీ డీఈఈ జగన్నాధరావు తెలిపారు. దీంతో ఈరోజు ప్రాజెక్టు నీటిమట్టం 518.270 అడుగులు ఉండగా 10.04టీఎంసీల నీరు ప్రాజెక్టులో…

నేటినుంచి కొత్త ‘ గరీబ్‌రథ్‌’

హైదరాబాద్‌: ప్రయాణీకులకు నేటినుంచి మరో కొత్త రైలు అందుబాటులోకి వస్తోంది. పూరి-యశ్వంత్‌పూర్‌ వీక్లీ గరీబ్‌రథ్‌ రైలు ఈ రోజునుంచి ప్రారంభం కానుంది. ప్రతి శుక్రవారం ఈ రైలు నడుస్తుంది.

ఘనంగా శ్రావణ మాస మహోత్సవాలు ప్రారంభం

హైదరాబాద్‌: శ్రావణ మాస మహోత్సవాలు హైదరాబాద్‌ కొత్తపేటలోని అష్టలక్ష్మీ దేవాలయంలో ఈ రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. 5 వారాలపాటు నిర్వహించే  శ్రావణ శుక్రవార ఉత్సవాల్లో తొలిరోజున మహాలక్ష్మికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునుంచే మహిళలు ఆలయానికి తరలివచ్చి అమ్మవారి…

మెడికల్‌ ఆన్‌లైన్‌ కౌన్సిలింగ్‌ ప్రారంభం

విజయవాడ:2012-13 విద్యాసంవత్సరానికి రాష్ట్రంలోని మూడు విశ్వవిద్యాలయాల పరిధిలో అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్‌, బీడీఎన్‌ సీట్లకు మొదటి విడత కౌన్సిలింగ్‌ 4 ఆన్‌లైన్‌ కేంద్రాల్లో ప్రారంభమైంది. విజయవాడలోని డాక్టర్‌ ఎన్‌టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో ఎంసెట్‌ రెండవ ర్యాంకర్‌ పవన్‌కుమార్‌ ఉస్మానియాలో…