స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలి

పరకాల, డిసెంబర్ 1 (జనం సాక్షి):
ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలి అని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.సోమవారం సంగెం మండలం బాలు నాయక్ తండా గ్రామం నుండి బిఆర్ఎస్ ఎస్టీ సెల్ అధ్యక్షులు వాంకుడోత్ తిరుపతి, బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు బానోతు శ్రీను, బానోతు బాలు గారు పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని, పాత కొత్త తేడా లేకుండా అందరూ సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలి అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పార్టీ అండగా ఉంటుందని అన్నారు.కాంగ్రెస్ పార్టీలోకి చేరిన వారిలో బానోతు వీరు, బానోతు రాజు, బుజేందర్, వెంకటేష్, గోపి, బద్రు, మోహన్ దాదాపు 30 మంది కాంగ్రెస్ పార్టీలోకి చేరారు



