కాంగ్రెస్ అధికారంలో ఉండేది రెండు సంవత్సరాలే

 


 

 

 

చెన్నారావుపేట, డిసెంబర్ 19 (జనం సాక్షి):

నర్సంపేట నియోజకవర్గం లో మార్పు మొదలైంది

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

నూతన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు సన్మానం

కాంగ్రెస్ అధికారంలో ఉండేది ఇంకా రెండు సంవత్సరాలు మాత్రమేనని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం చెన్నారావుపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో నూతనంగా గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులను శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నర్సంపేట నియోజకవర్గంలో సర్పంచ్ ఎన్నికలతో మార్పు మొదలైందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మోసపు మాటలను ప్రజలు ఎవరూ నమ్మలేదన్నారు. అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న గ్రామాలు, తండాలలో చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. చెన్నారావుపేట మండల కేంద్రంతో పాటు మేజర్ గ్రామపంచాయతీలలో బిఆర్ఎస్ పార్టీని ఆదరించి విజయాన్ని అందించినందుకు ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాలలో ఓడిపోయిన అభ్యర్థులకు బిఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు బాల్నె వెంకన్న, మండల ఎన్నికల కన్వీనర్ జక్క అశోక్, చెన్నారావుపేట సొసైటీ చైర్మన్ చింతకింది వంశీ, అమీనాబాద్ సొసైటీ చైర్మన్ మురహరి రవి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్లు అమ్మ రాజేష్, కొండవీటి ప్రదీప్ కుమార్, అనుముల కుమారస్వామి, జిల్లా పరిషత్ మాజీ కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ రఫీ, బిఆర్ఎస్ మండల సోషల్ మీడియా ఇన్ఛార్జి బోడ మురళి నాయక్, సర్పంచులు బుర్ర సుదర్శన్ గౌడ్, కంది శ్వేతా రెడ్డి, మెడబోయిన రజిత, బానోతు వినోద, యాట సుధాకర్, ధారావత్ రమేష్, చిలపాక అనిత, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.