CPIపార్టీ వనపర్తి మండల మహాసభ

వనపర్తి జులై    
 (జనం సాక్షి) భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వనపర్తి మండల మహాసభ వనపర్తి పట్టణంలో గల CPI పార్టీ ఆఫీసు నందు ఆదివారం కురుమయ్య అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ రాములు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే వరద బాధితులను రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.వరదల్లో ప్రజలు కొట్టుమిట్టాడుతుంటే బూటకపు మాటలు మాట్లాడుతూ ప్రజలను మభ్యపెడుతూ ధరలను అమాంతంగా పెంచి పేద మధ్యతరగతి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నారని వాపోయారు. వారు అధికార దాహంతో అధికారం అధికారం చేయి చిక్కించుకోవడానికి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు అన్నారు అదేవిధంగా దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేసి చోద్యం చూస్తున్నారని వారు అన్నారు. అందుకనే భారత కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం కొరకు ప్రతీ కార్యకర్త  కంకణ బద్ధులై పనిచేయాలని కార్యకర్తలకు తెలియజేశారు. ఈ నెల (జూలై) 21 ,22 వ తేదీలలో  జరిగే జిల్లా మహాసభలకు కార్మికులను, కార్యకర్తలను, ప్రజలను పెద్ద ఎత్తున తీసుకురావాలని పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు డి.చంద్రయ్య, కే మోష,రమేష్, నాయకులు రాంబాబు,మద్దిలేటి, కృష్ణయ్య,సురేష్,అంజి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area