డిండి శ్రీనివాసులుకు శ్రామిక శక్తి పురస్కారం
మల్కాజిగిరి మే 2ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యుత్ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న డిండి శ్రీనివాసులుకు ప్రతిష్టాత్మకమైన శ్రామిక శక్తి అవార్డు లభించింది. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు.ఆనంద్‌బాగ్‌లోని విద్యుత్ సబ్ స్టేషన్‌లో లైన్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తూనే, ఐఎన్‌టీయూసీ డివిజన్ అధ్యక్షుడిగా కార్మికుల సమస్యల పరిష్కారంలో డిండి శ్రీనివాసులు చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన కమిటీ ఈ అవార్డుకు ఎంపిక చేసింది.టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యదర్శి శ్రీధర్ చేతుల మీదుగా శ్రీనివాసులు ఈ అవార్డును స్వీకరించారు. వృత్తి పట్ల నిబద్ధతతో పాటు కార్మిక సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న శ్రీనివాసులుకు అవార్డు రావడం పట్ల సహచర ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డుతో మరింత బాధ్యత పెరిగిందని కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని శ్రీనివాస్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ రీజినల్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావుతో పాటు పలువురు కార్మిక సంఘాల నేతలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.



