సిరికొండలో ఘనంగా ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు

సిరికొండ జూన్ 21 (జనం సాక్షి): ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం సిరికొండ మండల కేంద్రంలో యోగ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, యువత, విద్యార్థులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాసనాలు చేసి యోగా ప్రాముఖ్యతను చాటిచెప్పారు.ఈ సందర్భంగా ముఖ్య వక్తగా పాల్గొన్న కట్టజి లింబాద్రి మాట్లాడుతూ యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప వరమని అన్నారు. యోగా ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపొందుతాయని తెలిపారు. ఆధునిక జీవనశైలిలో ఏర్పడుతున్న అనేక ఆరోగ్య సమస్యలకు యోగా మంచి పరిష్కారమని పేర్కొన్నారు.ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో కొంత సమయం యోగ సాధనకు కేటాయించి ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని సూచించారు. యువత, విద్యార్థులు యోగాను అలవాటు చేసుకోవడం ద్వారా శారీరకంగా, మానసికంగా మరింత దృఢంగా ఎదగగలరని చెప్పారు.”యోగతో ఆరోగ్యం – ఆరోగ్యంతో ఆనందం” అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని సంకల్పించారు.