ఒకే ఏడాదిలో 8 మంది విద్యార్థులకు ఐఐఐటీ సీట్లు

పీఎం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల విద్యార్థుల ఘన విజయం
సిరికొండ జూన్ 21 (జనం సాక్షి): పీఎం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల & జూనియర్ కళాశాల, సిరికొండ విద్యార్థులు ఐఐఐటీ ప్రవేశాల్లో విశేష ప్రతిభ కనబరిచారు. ఒకే విద్యా సంవత్సరంలో పాఠశాల నుంచి మొత్తం 8 మంది విద్యార్థులు ఐఐఐటీలకు ఎంపికై పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు.సిరికొండ గ్రామానికి చెందిన సునీత–గంగాధర్ దంపతుల కుమార్తె మల్లెల ఆకాంక్ష బాసర ఐఐఐటీలో సీటు సాధించి గ్రామానికి, పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల సహకారంతో ఈ విజయం సాధ్యమైందని పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒకే విద్యా సంవత్సరంలో 8 మంది విద్యార్థులు ఐఐఐటీలకు ఎంపిక కావడం పాఠశాల విద్యా ప్రమాణాలకు నిదర్శనమన్నారు. ఉపాధ్యాయుల నిరంతర శ్రమ, విద్యార్థుల పట్టుదల వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు.బాసర ఐఐఐటీకి ఎంపికైన విద్యార్థులు: గాండ్ల అభిజ్ఞ (మైలారం), వేంపల్లి శ్రీజ (చిన్న వాల్గొట్), మల్లెల ఆకాంక్ష (సిరికొండ), గుగ్లోత్ శివంజలి (జంగిలోడి తాండ), మాలవత్ యువరాజ్ (సర్పల్లి తాండ).