నూతన గ్రామ అభివృద్ధి కమిటీ ఎన్నిక

సిరికొండ జూన్ 21 (జనం సాక్షి): సిరికొండ మండల కేంద్రంలోని గ్రామ అభివృద్ధి కమిటీ భవనంలో శనివారం నిర్వహించిన సమావేశంలో నూతన గ్రామ అభివృద్ధి కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడిగా దేగం సాయిలు, ఉపాధ్యక్షుడిగా పారుపల్లి శివ, క్యాషియర్‌గా అంగూరి రాజా గణేష్ గౌడ్, కార్యదర్శిగా చిట్యాల రాజన్న, రైటర్‌గా నరసింహారావును ఎన్నుకున్నారు. సలహాదారులుగా తాళ్ల శ్రీనివాస్, దాసులను నియమించారు.కమిటీ సభ్యులుగా ప్రవీణ్, గంగాధర్, చింతకింది రాజన్న, రవి, రాజు తదితరులను ఎంపిక చేశారు. నూతన కమిటీ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజల సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు కట్టుబడి ఉంటుందని సభ్యులు తెలిపారు.ఈ సమావేశంలో గ్రామ పెద్దలు, యువకులు, కమిటీ సభ్యులు పాల్గొని నూతనంగా ఎన్నికైన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.



