గన్నారంలో అపోలో ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

, గన్నారం: ఇందల్వాయి మండల కేంద్రంలోని జనం సాక్షి గన్నారం గ్రామంలో కుంజర యాత్ర సందర్భంగా అపోలో ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ విమలాకర్ రెడ్డి నేతృత్వంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో పేద, నిరుపేద ప్రజలకు సాధారణంగా అధిక వ్యయంతో లభించే వైద్య సేవలను ఉచితంగా అందించారు.శిబిరంలో పాల్గొన్న వైద్య బృందం రోగులను పరీక్షించి, అవసరమైన వైద్య సలహాలు అందించడంతో పాటు ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు.ఈ కార్యక్రమాన్ని గన్నారం గ్రామ సర్పంచ్ సుజాతశ్రీనివాస్ గన్నారంగ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి రంజిత్ రెడ్డి మరియు ఉప సర్పంచ్ వెంకట్ ఆధ్వర్యంలో దొందడి గణేష్ రాజేందర్ రాకేష్ నిర్వహించారు. గ్రామ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను గ్రామ స్థాయిలో అందించేందుకు సహకరించిన అపోలో ఆసుపత్రి వైద్య బృందానికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.



