గడ్కోల్ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు సిరికొండ ఎస్సై రామకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు

సిరికొండ, జూలై 13 (జనం సాక్షి): గడ్కోల్ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు సోమవారం సిరికొండ పోలీస్ స్టేషన్‌లో ఎస్సై రామకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్సై రామకృష్ణకు శాలువా కప్పి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు శాఖతో సమన్వయంగా పనిచేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని ఎస్సై రామకృష్ణ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గడ్కోల్ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు సంతోష్ రెడ్డి, భూషణ్ రెడ్డి, నరికి రాములు, వెంకన్న, మాజీ సర్పంచ్ పోషన్న, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు