ఘనంగా తెలంగాణ రాష్ట్ర వాక్స్ బోర్డ్ చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్ జన్మదిన వేడుకలు.

ప్రభుత్వాసుపత్రి, మా అభాగ్యుల వృద్ధాశ్రమం పండ్ల పంపిణి..
గంభీరావుపేట జూలై 13(జనం సాక్షి); రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మల తిరుపతి గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వృద్ధాశ్రమంలోని వృద్ధులకు, ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేసి సేవా కార్యక్రమాలు చేపట్టారు.ఈ సందర్భంగా నిమ్మల తిరుపతి గౌడ్ మాట్లాడుతూ, సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్ ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి విభాగం నుంచి ఎదిగి, ఆల్ ఇండియా స్థాయిలో నాయకత్వం వహిస్తూ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా ప్రజలకు విశేష సేవలందిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరేలా నిరంతరం కృషి చేస్తున్న నాయకుడని కొనియాడారు.అజ్మతుల్లా హుస్సేన్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిల్లా మైనార్టీ మాజీ అధ్యక్షులు ఎస్.కె సాహెబ్. అక్బర్ జోగు సురేష్. గౌరీ శంకర్. లక్ష్మీనారాయణ. ఎల్ల బాలకృష్ణ. లక్కం బాబు. శేఖర్. ప్రవీణ్. నాంపల్లి. బాలయ్య కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.



