ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన మంత్రి అడ్లూరి..

నూతన వధువరులను ఆశీర్వదించిన మంత్రి..
ధర్మపురి జగిత్యాల జిల్లా జూలై 12(జనంసాక్షి) : ధర్మపురి నియోజకవర్గ అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదివారం గొల్లపల్లి మండలం అగ్గిమల్ల గ్రామంలో కంకణాల వసంత – లక్ష్మణ్ దంపతు లకు మంజూరైన ఇందిరమ్మ ఇంటిని రాష్ట్ర సాంఘిక మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆదివారం ప్రారంభించారు. నూతన గృహప్రవేశం చేసిన దంపతులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.గొల్లపల్లి మండలం రంగధాముని పల్లి గ్రామానికి చెందిన పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు మహేందర్ తమ్ముడు మనోహర్ వివాహ విందు వేడుకల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.గొల్లపల్లి మండల కేంద్రంలో చెందిన కాంగ్రెస్ కార్యకర్త ఆవుల ప్రవీణ్ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతుండగా మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆదివారం పరామర్శించారు. ప్రవీణ్ కు మెరుగైన వైద్యం అందించడానికి తన వంతుగా సహకరిస్తానని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.



