నేడు కల్లేడలో తాజుల్ ఔలియా నిస్బత్ మహిఫిల్

పర్వతగిరి, జులై 13 (జనం సాక్షి): వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లేడ లో ఖాన్‌ఖా-ఎ-ముహమ్మదీ అజ్మీరీ నుస్రతి నందు హజరత్ సయ్యదినా తాజుద్దీన్ ఔలియా నాగ్‌పురి రహమతుల్లా అలైహి వారి నాగ్‌పూర్ షరీఫ్ ఉర్స్-ఎ-ముబారక్ సందర్భంగా “తాజుల్ ఔలియా నిస్బత్ మహిఫిల్” ను నేడు మగ్రిబ్ నమాజ్ అనంతరం ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.పీరో ముర్షిద్ హజరత్ సయ్యద్ మీర్ నుస్రత్ అలీ ఖాద్రి చిష్టి సాబిరి నక్షబంది సోహర్వర్ది రిఫాయి షావలి ఇలాహి దామత్ బర్కాతుహు ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రత్యేక దువాలు, నాత్, జికర్ నిర్వహిస్తారు. కార్యక్రమానంతరం భక్తులకు లంగర్ ఏర్పాటు చేయబడింది. మహిళలకు ప్రత్యేక పర్దా సౌకర్యం కల్పించబడింది. కుల,మతాలకు అతీతంగా ఆశికానే ఔలియా అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.



