నిరుద్యోగ యువతకు అండగా మంత్రి శ్రీధర్ బాబు

— ప్రభుత్వ ఉద్యోగాల పోటీపరీక్షలకు సిద్ధం అవుతున్న పేద విద్యార్థుల కోసం ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి కోచింగ్ సెంటర్ ఏర్పాటు
— జూలై 15 నుండి మొదలవుతున్న ఉచిత కోచింగ్ సెంటర్
— సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పిలుపు
మంథని, జులై 13, ( జనంసాక్షి ) : మంథని నియోజకవర్గం లోని నిరుద్యోగ యువతకు మంత్రి శ్రీధర్ బాబు మరోసారి అండగా నిలిచారు. రాబోయే ప్రభుత్వ ఉద్యోగాల పోటీపరీక్షలకు సిద్ధం అవుతున్న పేద విద్యార్థుల కోసం ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి కోచింగ్ సెంటర్ ను రెండోసారి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. గత సంవత్సరంలో నిర్వహించిన మాదిరిగానే రెండు నెలలు పాటు మంథని హెడ్ కోటర్స్ లో మంథని , కాటారం హెడ్ క్వార్టర్స్ లో కాటారం లో, ముత్తారం, రామగిరి, కమాన్ పూర్, పాలకుర్తి, కాటారం, మహా ముత్తారం, మహాదేవపూర్, మలహర్ రావు, పలిమెల ఇతర మండలాలతో పాటు పెద్దపల్లి, భూపాల్ పల్లి జిల్లాలోని చెందిన నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగాల పోటీపరీక్షలకు వారి నైపుణ్యాన్ని పెంచడానికి శ్రీ విశ్వ అకాడమీ కోచింగ్ సెంటర్ ను మంథని/ కాటారంలో వారం రోజులలో ఏర్పాటు చేయబోతున్నారు. అనేక సంవత్సరాలుగా అనుభవం కలిగిన హైదరాబాద్ లెక్చరర్ల సారధ్యంలో కోచింగ్ సెంటర్ నిర్వహించనున్నారు. ఉదయం 10:00 గంటల నుండి 6:00 గంటల వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. కోచింగ్ తీసుకోవాలనుకునే నిరుద్యోగులు మంథని మరియు కాటారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దరఖాస్తు ఫారం తీసుకొని రెండు ఫోటోలు ఆధార్ కార్డు జిరాక్స్ వారి విద్యాపరమైన సర్టిఫికెట్లు జతపరిచి క్యాంపు కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క నిరుద్యోగ యువతీ యువకులు ఉచిత కోచింగ్ సెంటర్ శిక్షణను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఉన్న ఊరికి కన్న తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.



