గడ్కోల్ గ్రామంలో విజయవంతంగా SIR కార్యక్రమం నిర్వహణ

సిరికొండ, జూగడ్కోల్ లై 12 (జనం సాక్షి): సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని ఆదివారం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లతా శంకర్, బీఎల్ఏలు (BLAలు), ఏపీఎం మేడం, జీపీఓ (GPO), సంబంధిత అధికారులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఓటరు జాబితాలో పేర్ల నమోదు, మార్పులు, చిరునామా సవరణలు, తొలగింపులకు సంబంధించిన SIR దరఖాస్తుల ప్రాముఖ్యతను గ్రామ ప్రజలకు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవాలని, అవసరమైన పత్రాలను సమర్పించి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
గ్రామ ప్రజలు ఉత్సాహంగా స్పందించి SIR ఫారాలను నింపగా, అధికారులు వారికి అవసరమైన సూచనలు అందిస్తూ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను సులభతరం చేశారు. గ్రామంలో ఓటరు జాబితా పారదర్శకంగా, తప్పులులేకుండా రూపొందించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సర్పంచ్ లతా శంకర్ విజ్ఞప్తి చేశారు.



