బిఆర్ఎస్ నుండి తెలంగాణ జాగృతిలోకి… కూర సురేష్ పటేల్

గంభీరావుపేట మార్చి 31(జనం సాక్షి);రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలానికి చెందిన బిఆర్ఎస్ నాయకుడు, రాష్ట్ర మున్నూరు కాపు ఆర్గనైజింగ్ సెక్రటరీ గా పనిచేస్తున్న ప్రస్తుత బిఆర్ఎస్ నాయకుడు కూర సురేష్ పటేల్, మంగళవారం రోజు హైదరాబాదులోని జాగృతి కార్యాలయంలో జాగృతి అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో కండువా కప్పి సాదరంగా ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు వీరితోపాటు, ఎర్ర నరసయ్య, రంగారావు, ఉన్నారు,కూర సురేష్ పటేల్ మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గం అభివృద్ధి ముఖ్యమని, తెలంగాణ జాగృతి వల్ల అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.

బిఆర్ఎస్ విడిచిన కీలక నేత.. మున్నూరు కాపు సామాజిక వర్గం నేత.

2001తెలంగాణ పోరాటం నుండి తెలంగాణ ఉద్యమకారుడు బీసీ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ముద్దుబిడ్డ, బి ఆర్ ఎస్ పార్టీని వీడడం.. చర్చనీయంగా మారిపోయింది.. ప్రస్తుతం రాష్ట్ర మున్నూరుకాపు ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్న ముఖ్య నాయకుడు మండలంలో అత్యధిక జనాభా గలిగినమున్నూరుకాపు సామాజిక వర్గం నేత రాష్ట్రంలో ప్రముఖులు మంత్రులు ఎమ్మెల్యేలు జిల్లా నాయకులు ప్రజాప్రతినిధు లతో పాటు మంచి పట్టున నాయకుడు ఇప్పుడు జన జాగృతి పార్టీలోకి చేరడం బి ఆర్ ఎస్ కు పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు, సామాజిక వర్గం న్యాయం జరుగుతలేదని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం నుండి ఇప్పటివరకు 2001 నుండి 2026 వరకు పార్టీలో కీలకంగా పని చేసినప్పటికీ బీసీ సామాజిక వర్గానికి అందులో మున్నూరు కాపు సామాజిక వర్గానికి గుర్తింపు రాలేదని, దానికి తోడు ఒక పార్టీ కార్యకర్త ఎన్ని సంవత్సరాలు పని చేసినప్పటికీ ఒక ఎమ్మెల్యే ను నేరుగా కలవకపోవడం సమస్య చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్న ఎంతోమంది ఉన్నారని, సరియైన గుర్తింపు లేక పార్టీ వీడినట్టు సమాచారం.