నేత్రపర్వంగా హనుమాన్ శోభాయాత్ర
గంభీరావుపేట ఏప్రిల్ 03 (జనం సాక్షి);గంభీరావుపేట మండల కేంద్రంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని హనుమాన్ దేవాలయంలో హనుమాన్ మాలధారణ స్వాములు హనుమాన్ కు ప్రత్యేక పూజలు చేసి హనుమాన్ దేవాలయం నుండి గ్రామ పురవీధుల గుండా హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. శోభాయాత్రకు మహిళలు మంగళారతులు తీసుకువచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. శోభాయాత్రలో స్వాములు ఆటపాటలతో శోభ యాత్ర కనుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ స్వాములు మాట్లాడుతూ ప్రతి ఏటా హనుమాన్ జయంతిని స్వాములంతా కలిసి పెద్ద ఎత్తున హనుమాన్ శోభయాత్ర నిర్వహిస్తామని ఈ శోభాయాత్రకు సహకరించిన దాతలకు భక్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ హనుమాన్ కృపాకటాక్షాల వల్ల ప్రజలంతా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో పాడిపంటలతో చల్లగా ఉండేలా చూడాలని అన్నారు ఈ కార్యక్రమంలో హనుమాన్ స్వాములు సిరిపురం రవి శ్రీకాంత్ స్వామి. అరవింద్ హనుమాన్ మాలధారణ స్వాములు భక్తులు తదితరులు పాల్గొన్నారు.


