కలెక్టర్ చే రూరల్ తహశీల్ కార్యాలయం ప్రారంభోత్సవం
నిజామాబాద్ సిటీ ఏప్రిల్ 08 (జనం సాక్షి ):నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ లో నూతనంగా నెలకొల్పిన నిజామాబాద్ రూరల్ తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ప్రారంభోత్సవం చేశారు. కార్యాలయంలోని ఆయా విభాగాలను సందర్శించి వసతులను పరిశీలించారు. సందర్శకుల కోసం అందుబాటులో ఉన్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు పూర్తి పారదర్శకంగా, సమర్ధవంతంగా సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఇంచార్జి రూరల్ తహసీల్దార్ వినయ్ సాగర్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు రమణ్ రెడ్డి, శ్రీనివాస్ రావు, విజయ్ కాంత్ తదితరులు పాల్గొన్నారు.


