ఘనంగా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి జన్మదిన వేడుకలు

… శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ డాక్టర్ కడియం కావ్య
… జన్మదినం సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం
స్టేషన్ ఘన్‌పూర్, జూలై 08 ( జనం సాక్షి ) :
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో మాజీ ఉప ముఖ్యమం త్రి, స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించ బడ్డాయి. ఈ కార్యక్రమానికి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య హాజరై స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి కి జన్మదిన శుభాకాంక్ష లు తెలియజేశారు.ఈ సందర్భంగా పార్టీ నాయ కులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమాను ల సమక్షంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి కేక్ కట్ చేశారు. నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలోతరలివచ్చిన కార్యకర్తలు,అభిమానులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమాన్ని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య , ఎమ్మెల్యే కడియం శ్రీహరి కలిసి ప్రారంభించారు. అనంతరం వారు స్వయంగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొ ని ప్రజలకు భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమం లో వందలాది మంది ప్రజలు పాల్గొని అన్నప్రసా దాన్ని స్వీకరించారు.అనంతరం దివంగత ముఖ్య మంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు వైయస్సార్ ప్రజా సంక్షేమ పాలనను స్మరించుకున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ ఇటీవల రైతు భరోసా నిధులు విడుద ల చేసిన సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా, రైతు, మహిళా సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శనంగా నిలుస్తున్నాయని కొనియాడారు. ఈ వేడుకల్లో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ మండ లాల కార్యకర్తలు, యువజన నాయకులు, మహి ళా నాయకులు, అభిమానులు, నియోజకవర్గ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమా వేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ 74ఏళ్ళు పూర్తి చేసుకొని 75వ వసంతంలోకి అడుగు పెట్టానని నా పుట్టినరోజు సందర్బంగా నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతీ ఒక్కరికీ అభినందనలని,నాకు రాజకీయ జన్మనిచ్చిన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజల ఋణం తీర్చుకోలేనిదని అన్నారు. నియోజకవర్గ ప్రజల మద్దతుతోనే సుదీర్ఘకాలంగా రాజకీయాలలో కొనసాగగలుగుతున్నానని, ప్రజలు ఇచ్చిన అవ కాశాన్ని అభివృద్ధి కోసమే ఉపయోగించానని,
ఏనాడూ అవినీతికి పాల్పడకుండా నిజాయితీగా పని చేశానని,బాల కార్మికునిగా పని చెసి ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఏదిగానని అన్నారు. అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్లతోనే ఈ స్థాయికి చేరుకోగాలిగానని,సామాన్య పేద కుటుంబంలో పుట్టి ఇన్నేళ్లుగా రాజకీయాలలో కొనసాగుతున్నా ను అంటే దానికి నా నిజాయితీనే కారణమని తెలిపారు. నేను పని చేసిన ముఖ్యమంత్రులు అందరూ నన్ను గౌరవించారని,దేవాదుల ద్వారా రైతులకు సాగు నీరు అందించడం నాకు అత్యం త సంతృప్తిని ఇచ్చిన అంశంఅని అన్నారు.
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం, ప్రజా సమస్యలను పరిష్కరించాడమే నాకున్న ఏకైక సంకల్పం అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథా లయ చైర్మన్ మారుజోడు రాంబాబు, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, మార్కెట్ చైర్మన్ జూలుకుంట్ల లావణ్య శిరీష్ రెడ్డి, చిల్పూర్ గుట్ట దేవాలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, కాంగ్రెస్ స్టేషన్గన్పూర్ మండల అధ్యక్షుడు జూలు కుంట్ల శిరీష్ రెడ్డి,పట్టణఅధ్యక్షుడు అంబటి కిషన్ రాజు, చిల్పూర్ మండల అధ్యక్షుడు చిర్ర నాగ రాజు, జాఫర్గడ్ మండల అధ్యక్షుడు నూకల ఐలయ్య, ధర్మసాగర్ మండల అధ్యక్షుడు పెసరు రమేష్, రఘునాథ్ పెళ్లి మండలాధ్యక్షుడు గాదె మహేం దర్ రెడ్డిని, వేలేరు మండల అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్ నాయకులు బెలిదే వెంకన్న, లింగాల జగదీష్ చంద్ర రెడ్డి, బూర్ల శంకర్, పొన్న రవి, పొన్నం రాజయ్య, నీల గట్టయ్య, కోళ్ల రవి గౌడ్, బొమ్మిశెట్టి బాలరాజు, గడ్డ మీద సురేష్ కుమార్, రజాక్, అన్నేబోయిన బిక్షపతి, బేతి జయపాల్ రెడ్డి, నాగరబోయిన శ్రీరాములు, కొలిపాక సతీష్,రామకృష్ణ, ప్రసాద్, రత్నాకర్ రెడ్డి, రమేష్, భూక్య సుధాకర్, గుగులో త్ ఉమ్లా నాయక్, 7 మండలాల ప్రజాప్రతినిధు లు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



