గౌరారం గ్రామంలో ఎలుగుబంటి( జనం సాక్షి) వేషధారణతో కోతులను తరిమెందుకు వినూత్న ప్రయోగం

.. కోతుల బెడద కారణంగా భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలు

ఇందల్వాయి( జనం సాక్షి) : 
ఇందల్వాయి మండల కేంద్రంలోని గౌరారం గ్రామంలో కోతుల బెడద విపరీతంగా ఉండడంతో కోతుల బెడదను నివారించడానికి గ్రామస్తులు ఎలుగుబంటి మారువేషాలు వేసుకుని కోతులను తరిమిన సంఘటన గౌరారం గ్రామంలో జరిగిందన్నారు.కోతులు మనుషులకు భయపడటం మానేయడంతో, గ్రామస్తులు ఈ వినూత్న ఆలోచనలను ఆశ్రయిస్తున్నారు.ముఖ్యమైన విషయాలు పద్ధతులు:ఎలుగుబంటి వేషాలు: కోతులు సహజంగా ఎలుగుబంట్లు పెద్ద జంతువులను చూసి భయపడతాయి.దీనిని ఆసరాగా చేసుకునీ ఇందల్వాయి మండలంలోని గౌరారం గ్రామంలో స్థానికులు ఎలుగుబంటి దుస్తులు ధరించి కోతులను అడవుల వైపు తరిమికొట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్,సభ్యులు, గ్రామ సర్పంచ్,గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు