ఎర్రబెల్లి హరి మరణం పట్ల సంతాపం తెలిపిన పర్వతగిరి మండల విద్యాశాఖ

-భౌతిక దేహానికి నివాళులు అర్పించిన అధికారులు
పర్వతగిరి: జులై 8 జనం సాక్షి పర్వతగిరి మండల విద్యాశాఖ అధికారి ఎ. బిక్షపతి మరియు పర్వతగిరి కాంప్లెక్స్ హెడ్మాస్టర్ కె నవీన్ కుమార్ పర్వతగిరి మండల కేంద్రంలోని విశ్వజెనిత్ ప్రవేట్ పాఠశాల కరస్పాండెంట్ ఎర్రబెల్లి హరికుమార్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. వారి మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పర్వతగిరి మండల విద్యాశాఖ అధికారి ఏ. బిక్షపతి మాట్లాడుతూ ఎర్రబెల్లి హరికుమార్ సౌమ్యుడు మృదుస్వభావి అని అన్నారు. విద్యారంగంలో ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన వ్యక్తి అని వారి మరణం విద్యారంగానికి తీరని లోటు అని అన్నారు. ఈ విషాదం నుండి వారి కుటుంబం త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు పాక రమేష్ బాబు ఎమ్మర్సీ స్టాఫ్ గారె జయరాజ్ వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



