ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జూలపల్లి సర్పంచ్

 

 

 

 

 

 

మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం జూలపల్లి గ్రామ సర్పంచ్ పోలు దాసరి వనిత సాయికుమార్ ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు. సర్పంచిగా గెలిస్తే మార్కెట్ వారసంత ఏర్పాటుచేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తామని హామీ ఇవ్వగ.. బుధవారం గ్రామంలో వారసంతను కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా ప్రారంభించి జూలపల్లి సర్పంచ్ పోలుదాసరి వనిత సాయికుమార్ ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. దీంతో గ్రామ ప్రజలతోపాటు, వర్తకం కోసం వచ్చిన చిరు వ్యాపారులు, రైతులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ సౌమ్య, వార్డు సభ్యులు ఇరుగురాల రాజు , ఇరుగురాల జీవనజ్యోతి, సాగర్ల రమ, బొల్లంపల్లి సంతోష్ కుమార్, పంచాయతీ కార్యదర్శు అంబటి శంకర్, గ్రామ పెద్దలు, నాయకులు యువకులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.