పార్క్‌లో సఫారీకి వెళ్లిన బాలుడిపై దాడి చేసిన చిరుత
ఆగష్టు20(జనం సాక్షి)హాలిడే సందర్భంగా సరదాగా పార్క్‌కు వెళ్లిన ఓ కుటుంబానికి ఊహించని అనుభవం ఎదురైంది. పార్క్‌లో సఫారీకి వెళ్లగా అక్కడ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సఫారీ వాహనంలో ఉన్న సమయంలో చిరుతదాడి చేసింది. ఈ దాడిలో 13 ఏళ్ల బాలుడు గాయపడ్డాడు. ఇందుకుఆగస్టు 15 సందర్భంగా హాలిడే కావడంతో ఓ ఫ్యామిలీ సరదాగా గడిపేందుకు బెంగళూరు లోని బన్నెర్ఘట్ట బయోలాజికల్ పార్క్ కు వెళ్లింది. అక్కడ చిరుతలను చూసేందుకు సఫారీకి వెళ్లింది. ఓ చోట డ్రైవర్ వాహనాన్ని ఆపాడు. అక్కడ చిరుత రోడ్డుపక్కన కూర్చుని కనిపించింది. కాసేపటి తర్వాత డ్రైవర్ వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. అప్పటి వరకూ కామ్‌గా ఉన్న చిరుత ఒక్కసారిగా వాహనాన్ని వెంబడించింది. విండో పక్కన కూర్చొని ఉన్న బాలుడిపై దాడి చేసింది. ఈ దాడిలో బాలుడికి గాయాలైనట్లు తెలిసింది.సదరు బాలుడు తన చేతులను విండో బయటకు పెట్టడంతోనే చిరుత దాడి చేసిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో వాహనంలోని టూరిస్ట్‌లు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ తతంగాన్నంతా వెనుక సఫారీ వాహనంలోని పర్యాటకులు తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ఆ వీడియో వైరల్ అవుతోంది.సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.