ఇథనాల్‌ కంపెనీలను రద్దు చేసేదాకా పోరాడుదాం

రాజోలి (జనంసాక్షి) : భూతాపాన్ని పెంచే ఇథనాల్‌ ఫ్యాక్టరీలను రద్దు చేసేదాకా ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని పలువురు రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు. రాజోలి మండలం పెద్ద ధన్వాడలో కొనసాగిస్తున్న రిలేదీక్షలు గురువారం నాటికి 15వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. పంట భూములను నాశనం చేసే ఫ్యాక్టరీలు మాకొద్దు.. ప్రజల ప్రాణాలే ముద్దు అంటూ నినాదాలు చేశారు. హాని కలిగించే పరిశ్రమలను ప్రభుత్వం రద్దు చేయాలని కోరారు. ఈ సందర్భంగా రైతుల దీక్షలకు పలువురు నాయకులు, ప్రజాసంఘాల నుంచి మద్దతు లభిస్తోంది.