జూన్ 17, 18 తేదీలలో లియాఫీ ఆల్ ఇండియా
జనరల్ బాడీని జయప్రదం చేయండి
షేక్ షాజహాన్, కొనతం పాపయ్య నాయుడు
హయత్ నగర్, మే 30 ( జనం సాక్షి )
ఆల్ ఇండియా జనరల్ బాడీ సమావేశం జూన్ 17, 18 తేదీలలో హైదరాబాదు లోని నాగోల్ శుభం కన్వెన్షన్ లో నిర్వహించడానికి, చంపాపేట లోని లియాఫీ బిల్డింగ్ లో సన్నాహక సమావేశాన్ని నిర్వహించి, బ్యానర్ లను విడుదల చేశారు. ఆల్ ఇండియా జనరల్ బాడీ మీటింగ్ కి సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి ని లియాఫీ ఆల్ ఇండియా సెక్రటరీ జనరల్ ఆధ్వర్యంలో ఆహ్వానించారు. ఈ సమావేశంలో లియాఫీ 1964 ఆల్ ఇండియా సెక్రెటరీ జనరల్ ఎస్ బి శ్రీనివాస చారి, ఆల్ ఇండియా లీడర్స్ సింగారం శ్రీనివాస్, షేక్ షాజహాన్, అశోక్ కుమార్, కోటిరెడ్డి, జోనల్ లీడర్స్, డివిజన్ లీడర్స్, బ్రాంచ్ లీడర్స్ ఆల్ ఇండియా జనరల్ బాడీ సమావేశాన్ని విజయవంతం చేయుటకు కమిటీలను ఏర్పాటు చేశారు. కమిటీల వారీగా బాధ్యతలు తీసుకోవడం జరిగిందని, దాదాపు 3500 ఏజెంట్ లీడర్స్ ఆల్ ఇండియా నుండి వస్తారని, మీటింగును సక్సెస్ చేయుటకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని, ప్రెస్ అండ్ పబ్లిసిటీ చైర్మన్ లు షేక్ షాజహాన్, కొనతం పాపయ్య నాయుడు లు తెలియజేశారు.



