లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ
ఆగష్టు 25 ( జనం సాక్షి):మహారాష్ట్రలోని పుణెలో కాలేయ మార్పిడి చేయించుకున్న భార్యాభర్తలు మృతిచెందారు. భర్తకు లివర్ అవయవాన్ని దానం చేసిన భార్య.. తన భర్త చనిపోయిన కొన్ని రోజులకే ప్రాణాలు విడిచింది. దీంతో మహారాష్ట్ర సర్కారు పుణెలోని ప్రైవేటు ఆస్పత్రులకు నోటీసులు జారీ చేసింది. సహ్యాద్రి ఆస్పత్రిలో కాలేయ మార్పిడి సర్జరీ జరిగింది. ఆ ప్రొసిడజర్‌కు చెందిన పూర్తి వివరాలను ఇవ్వాలని ఆరోగ్యశాఖ కోరింది. ఆస్పత్రికి నోటీసులు జారీ చేసినట్లు ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ నాగనాథ్ యంపల్లి తెలిపారు. గ్రహీత, దాతకు చెందిన వీడియో రి
బాధిత తంపతులను బాబూ కోమ్కార్, అతని భార్య కామినిగా గుర్తించారు. భర్త బాపుకు తన కాలేయాన్ని డోనేట్ చేసింది కామినీ. ఆగస్టు 15వ తేదీన ఆ సర్జరీ జరిగింది. కాలేయ మార్పిడి శస్త్రచికిత్స తర్వాత బాపు కోమ్కార్ ఆరోగ్యం క్షీణించింది. అతను ఆగస్టు 17వ తేదీన చనిపోయాడు. అయితే ఇన్‌ఫెక్షన్ సోకడం వల్ల ఆగస్టు 21వ తేదీన కామిని మృతిచెందింది.
వైద్యుల నిర్లక్ష్యం వల్ల దంపతులు మృతిచెందినట్లు కుటుంబసభ్యులు ఆరోపించారు. మరణించిన వారి పట్ల దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రోటోకాల్ ప్రకారమే శస్త్రచికిత్స నిర్వహించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. విచారణకు సహకరిస్తున్నట్లు చెప్పారు. బాధిత పేషెంట్ బాపు కోమ్కార్‌కు పలు రకాల హైరిస్క్ రుగ్మతలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కామిని కోమ్కార్ మృతి గురించి ఆస్పత్రి స్పందిస్తూ.. సర్జరీ తర్వాత ఆమె ప్రారంభంలో బాగానే కోలుకున్నదని, కానీ ఆ తర్వాత ఆమె సెప్టిక్ షాక్‌కు గురైందని, దీంతో పలు అవయవాలు దెబ్బతిన్నట్లు చెప్పారు.అత్యాధునిక చికిత్స విధానంతో కూడా ఆమెను కాపాడుకోలేకపోయినట్లు చెప్పారు.
కార్డులను సమర్పించాలని ఆదేశించారు.