మెదక్ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి మెదక్ ఎమ్మెల్యే

మెదక్ ఏప్రిల్ 12 (జనం సాక్షి )నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి – మంత్రి, కలెక్టర్ తో మాట్లాడినమెదక్ ఎమ్మెల్యే పైనంపల్లి రోహిత్ రావు.మెదక్ నర్సింగ్ కళాశాలలో వసతులు సరిగా లేవంటూ ఆందోళన దిగిన ఘటనపై మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తోపాటు జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ తో మాట్లాడి ఆమెను వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు. గత కొంతకాలంగా కళాశాలలో వసతుల విషయంపై ఎవరి దృష్టికి తీసుకు రాలేదని, విద్యార్థులు రోడ్డెక్కింతవరకు చూసిన ప్రిన్సిపాల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. నర్సింగ్ కళాశాల విద్యార్థులకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని అన్నారు. ప్రిన్సిపల్ పూర్తి నిర్లక్ష్యం వల్లే ప్రభుత్వం కు చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరించిన ఆమెను వెంటనే సస్పెండ్ చేయాలని మంత్రికి, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా చూస్తామన్నారు. అధికారులను పర్యవేక్షించి వారి సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని ఎమ్మెల్యే రోహిత్ రావు అన్నారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన అవసరం లేదని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు రాకుండా చూస్తామన్నారు. ప్రభుత్వంకు చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరించిన ఎ అధికారం కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదన్నారు. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా అన్ని సమకూర్చాల్సిన అవసరం ఉండగా, కేవలం ప్రిన్సిపల్ తప్పిదం వల్లే ఈ ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. నర్సింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలను వీలైనంత త్వరగా పరిశీలించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే రోహిత్ రావ్ హామీ ఇచ్చారు.

తాజావార్తలు