చెరువుకుంటలో పడి హాస్టల్ ఇద్దరు విద్యార్థుల మృతి

మల్యాల ఆగస్టు 3 (జనం సాక్షి) : టాయిలెట్‌కు వెళ్తున్నామని చెప్పి హాస్టల్ వసతి గృహం నుంచి సోమవారం మధ్యాహ్నం బయటకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు చెరువు కుంటలో పడి మృతి చెందిన సంఘటన తో విషాద ఛాయలు అలుముకున్నాయి. మల్యాల మండల కేంద్రం శివారులోని భీమన్న గుట్ట చెరువు కుంట సమీపంలో విద్యార్థుల దుస్తులు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గల్లంతైన విద్యార్థుల మృతదేహాలను చెరువు నుండి బయటకు తీయించారు.పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ లో విద్యార్థుల మృతదేహాలను తరలించారు. వడ్డెర కాలనీ సమీపంలోని బీసీ హాస్టల్ లో ఉంటూ చదువుతున్న జగిత్యాల పట్టణంలోని టీఆర్‌నగర్ కాగా 4 తరగతి విద్యార్థి జగన్నాథం సుశాంత్, నిజామాబాద్ జిల్లా మోర్తాడు మండల కేంద్రానికి చెందిన 5 తరగతి విద్యార్థి వనం విష్ణు విద్యార్థులు గా గుర్తించారు.సరదాగా స్నానం చేసేందుకు చెరువులోకి దిగి ప్రమాదవశాత్తు మునిగిపోయి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.పోలీసులు అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విద్యార్థుల మృతికి బాధ్యులెవరు తమ పిల్లలు భద్రంగానే హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారని భావిస్తూ ప్రశాంతంగా ఉంటున్న తల్లిదండ్రులకు సంఘటన భయాందోళనలు కలిగిస్తున్నాయి.నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థులు బయటకు వెళ్లడం ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు భావిస్తున్నారు.

తాజావార్తలు