టెన్త్ విద్యార్థులకు ఫ్యాడ్, పెన్నులు అందించిన ఎం ఎల్ ఏ రాగమయి

ఆశ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రోత్సహకాల పంపిణీ
పెనుబల్లి, మర్చి 12(జనంసాక్షి) పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు సత్తుపల్లి శాసన సభ్యురాలు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి గురువారం పెనుబల్లి మండలం వి ఎం బంజర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఆశ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పెన్నులు ఫ్యాడ్ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించి మీరు చదువుకున్న పాఠశాలకు మీ తల్లిదండ్రులకు మంచి పేరును సంపాదించడంతోపాటు మీ విద్యా భవిష్యత్తును మెరుగుపరుచుకోవాలని తెలియజేశారు. కార్యక్రమంలో అధికారులు, మండల నాయకులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.



