కమాన్ పూర్ ఆదివరాహ స్వామి దేవస్థానం చైర్మెన్ గా ముస్త్యాల దామోదర్
మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం పరిధిలోని కమాన్ పూర్ మండల కేంద్రంలోని స్వయంభు శ్రీ ఆదివారాహ స్వామి దేవస్థానం నూతన చైర్మెన్ గా జూలపల్లి మాజీ ఎంపీటీసీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముస్త్యాల దామోదర్ నియమితులయ్యారు. చైర్మన్ తో పాటు పాలకవర్గాన్ని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే డైరెక్టర్ లు గా చాట్ల రాయమల్లు, తాళ్ల భాగ్య శ్రీ లక్ష్మీనారాయణ , పిల్లి రాజు, సాగి శ్రీనివాస్ రావు, తిమ్మరాజు గీరిజ – సంతోష్, తీగల రాజయ్య, కుందారపు శంకర్, గాజుల శ్రీనివాస్, బుస శ్రీనివాస్, బొజ్జ సతీష్, అనవేన శ్యామల – సదయ్య, కొంతం శ్రీనివాస్, మల్యాల మల్లేష్ లు నియమితులయ్యారు. అలాగే ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఆలయ ప్రధాన అర్చకులు కలకుంట్ల వరప్రసాదచార్యులు నియామకం కావడం జరిగింది. తమపై నమ్మకంతో ఆదివరాహ దేవస్థానం చైర్మెన్, డైరెక్టర్లు అవకాశం కల్పించిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కి, సహకరించిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబు కి చైర్మన్ ముస్త్యాల దామోదర్, డైరెక్టర్లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నూతన చైర్మన్, డైరెక్టర్ ల నియామకం పట్ల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ అన్వర్ హర్షం వ్యక్తం చేశారు.


