గుంతలు పూడ్చిన నల్గొండ జర్నలిస్టులు

నల్గొండ (జనంసాక్షి) : నల్గొండ బస్టాండ్ ప్రాంతంలో ఇద్దరు జర్నలిస్టులు చాటిన బాధ్యత పట్ల హర్షం వ్యక్తమవుతోంది. రోడ్డుపై పడిన గుంతలలో సిమెంట్ కంకరను వేసి పూడ్చారు మున్సిపల్ రోడ్డు కాంట్రాక్టర్లు. కొన్ని వాహనాలు సూచిక లేకపోవడంతో సిమెంటు పైనుంచి వాహనాలను దూసుకెళ్లారు. దీంతో మళ్లీ గుంతలు ఏర్పడిన పరిస్థితి. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం అటుగా వెళ్తున్న జర్నలిస్టులు ఎండి కలీమ్ ఖాన్, ఓడపల్లి మధు ముదిరాజ్ (జనంసాక్షి) స్పందించి తమవంతుగా గుంతలు అప్పటికప్పుడే పూడ్చారు. వాహనాలు మళ్లీ వాటిమీద వెళ్లకుండా సూచికలు ఏర్పాటు చేసి జాగ్రత్తలు చేశారు. జర్నలిస్టులు పెన్ను మాత్రమే కాదు.. అవసరం అయితే సమాజం కోసం దేనికైనా సిద్ధం అంటున్నారు.