కోళ్ల వాహనం ఢీకొని ఒకరు మృతి

 

 

 

చందంపేట ఆగష్టు 17(జనం సాక్షి)చందంపేట మండలం పోలే పల్లి సమీపంలో వెళ్తున్న లారీ నీ డీ కొని ఒకరు మృతిచెందిన సంఘటన చోటుచేసుకుంది వివరాలు ఇలా ఉన్నాయి ఆమనగల్ నుంచి కోళ్లను లోడ్ చేసుకొని పోలేపల్లి గేట్ వద్ద చికెన్ షాప్ లకు కోళ్లను వేసి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది ప్రమాదంలో భూతం లింగయ్య (42) అక్కడికక్కడే మృతి చెందారు వీరికి ఒక బాబు ఒక కూతురు ఉన్నారు. కోళ్ల వాహనం డ్రైవర్ కుంటి గొర్ల సైదులు( 37) సూపర్వైజర్ వద్దిమల్ల రాఘవేంద్ర (30) లకి తీవ్ర గాయాలయ్యాయి. వీరు గుర్రంపోడు మండలం చిన్నయి చింత గ్రామానికి చెందిన వారుగా గుర్తించి వారికి చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి సమాచారం పోలీసులు ఇంకా వెల్లడించలేదు.