టీజీఈ జేఏసీ ఆధ్వర్యంలో ఎమ్మార్వోకి వినతిపత్రం

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించాలి..
భీమదేవరపల్లి:ఏప్రిల్ 18(జనం సాక్షి)తెలంగాణ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సంయుక్త చర్య కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ప్రభుత్వంపై పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించిన పలు సమస్యలు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 2004 తర్వాత నియమితులైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం (ఓపి ఎస్)అమలు చేయాలని.పెండింగ్ డీఏ బకాయిలు విడుదల చేయాలని కోరారు. అలాగే పే రివిజన్ కమిషన్ పిఆర్సి సిఫారసులను అమలు చేయడం, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం వంటి డిమాండ్లు ఉంచారు.
ఇంకా, ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. వెంటనే సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రాజేష్, నయాబ్ తహసిల్దార్ సూర్య నాయక్, సీనియర్ అసిస్టెంట్ సీమన్ నాయక్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు బి శ్రీధర్,ఎన్ రాజు, కంప్యూటర్ ఆపరేటర్ సాయిరాం, మండలంలోని వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పాల్గొని తమ ఐక్యతను చాటారు.



