ముళ్లకంచెల్లో కూర్చొని చిన్నారులు, బస్తీవాసుల నిరసన
కాప్రా (జనంసాక్షి) : పేరుకే ఆదర్శనగర్ ఎటు చూసినా సమస్యలే స్వాగతం పలుకుతాయి. పేదల నివసించే బస్తీలో పార్కులు కబ్జాకు గురవుతున్నాయి. ఈ మేరకు చర్లపల్లి కాలనీల సమాఖ్య సిసిఎస్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం బస్తివాసులు, చిన్నారులు, మహిళలు ఆందోళనకు దిగారు. ముళ్లకంచెల్లో కూర్చొని గంటపాటు నిరసన తెలిపారు. అభివృద్ధికి అందనంత దూరంలో చర్లపల్లి డివిజన్‌లో కాలనీలో ప్రథమ స్థానంలో ఉన్నాయని అక్కడి సమస్యల చూస్తే కనిపిస్తోందని, ఆహ్లదం పంచే మార్గాలు చూపించండి మహాప్రభో అని వేడుకుంటున్నామని, కాలనీలోని పార్కులు చెత్త చెదారంతో బిక్కుబిక్కు మంటూ బతకాల్సి వస్తుందని వాపోతున్నారు. ఈ కార్యక్రమంలో చర్లపల్లి కాలనీల సమాఖ్య సిసిఎస్ అధ్యక్షులు ఎంపల్లి పద్మా రెడ్డి, ఆదర్శ కాలనీ ప్రతినిధులు నరసింహ వంశరాజ్, ముత్తు వంశరాజ్, సిసిఎస్ ఉపాధ్యక్షులు గంప కృష్ణ, యావపురం రవి, బివి నరసింహారెడ్డి, ఉపేందర్ వంశరాజ్, సింగిరెడ్డి నరసింహారెడ్డి, కంచు గట్ల రాము, చిట్టిబాబు, గిరి మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.