గ్రామాల అభివృధి దిశగా ప్రజాపాలన :సర్పంచ్ గద్దల నవీన్

ఏటూరునాగారం,మార్చి 03(జనంసాక్షి).మండలంలోని రామన్నగూడెం గ్రామ పంచాయతీ లో గురువారం గ్రామ సర్పంచ్ గద్దల నవీన్ అధ్యక్షతన “మన ఊరు మన భాధ్యత” -99 రోజుల గ్రామ ప్రణాళిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎస్ఐ మహేష్ మాట్లాడుతూ నేరాల నియంత్రణలో సిసి కెమెరాలు అత్యంత కీలకం అన్నారు. గ్రామంలో జరిగే మంచి చెడులను దొంగతనాలు అన్ని రకాల చెడులను అరికట్టవచ్చున న్నారు. గ్రామ సర్పంచ్ నవీన్,మాట్లాడుతూ గ్రామ ప్రజలు అందరూ బాధ్యతగా వ్యవహరిస్తూ గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని అన్ని రంగాల్లో రామన్నగూడెం గ్రామాన్ని అభివృద్ధి దిశగా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు .
గ్రామస్తులు : గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ పరిస్థితి బాగా లేదని పారిశుధ్య పనులుపై గోదావరి కరకట్ట మరియు కరకట్టకు అమర్చిన గేట్ల విషయం సీజనల్ వ్యాధులపై, జడ్పీఎచ్ఎస్ స్కూల్ అలాగే ప్రైమరీ స్కూల్ విషయం విద్యార్థుల భోజనం విషయంలో వచ్చిన ఫిర్యాదులపై గ్రామంలో సమస్యలపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అబ్బు ప్రవీణ్, పోలీస్ శాఖ ఎస్ఐ మహేష్ ,రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ ఐ ధనలక్ష్మి,విద్యుత్ శాఖ సబ్ ఇంజనీర్ సుమన్ కుమార్, ఇరిగేషన్ ఏఈ రాజమౌళి,అగ్రికల్చర్ ఏఈఓ జెస్సీ రవికుమార్,జడ్పీఎచ్ఎస్ హెడ్మాస్టర్ రాంబాబు,ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ నటరాజు, గ్రామ సర్పంచ్ నవీన్ , ఉపసర్పంచ్ కోడి ధర్మరాజు, కారోబార్ ఇట్టెo వెంకటేశ్వర్లు, వార్డు సభ్యులు, గ్రామస్తులు చెన్నూరు బాలరాజు,కోడి గోపాల్, అల్లి శంకరయ్య,వేమునూరి సృజన్, మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.