తెలంగాణలో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

  • రాష్ట్రంలో చురుకుగా మారిన నైరుతి రుతుపవనాలు
  • హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
  • ఈదురు గాలులతో వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ
  •   మూడు రోజుల పాటు భారీ వర్షాలు..

అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్‌ కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడతాయని తెలిపింది.గురువారం తూర్పు, మధ్య తెలంగాణలోని పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణలో శుక్రవారం సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. దక్షిణ తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడతాయని పేర్కొంది. హైదరాబాద్ నగరంలోనూ సాయంత్రం వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి రుతుపవనాలు చురుకుగా మారడంతో రాబోయే రెండు వారాల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు.