ఆర్టీసి బస్సు ద్విచక్ర వాహనం డీ

ఒకరు మృతి ఇద్దరి పరిస్థితి విషమం
గద్వాల టౌన్ మార్చి 17 జనంసాక్షిజిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ కు వెళ్లే రోడ్డు మార్గంలో ఆర్టీసీ బస్సు,ద్విచక్ర వాహనం డీ కొన్నాయి.ఈ ఘటనలో అయిజకు చెందిన రాము(17) అక్కడక్కడే మృతి చెందాడు.మిట్టదొడ్డి గ్రామానికి చెందిన విష్ణు (17),గద్వాల పట్టణంలోని గంజిపేటకు చెందిన వర్ధన్ కు తీవ్ర గాయాలయ్యాయి.స్థానికులు వారిని 108 ద్వార గద్వాల ఏరియా ఆసుపత్రికీ తరలించారు.ఘటనలో ఒకరు చనిపోగా మిగత ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గద్వాల పట్టణ ఎస్సై కళ్యాణ్ కుమార్ కేసు నమోదు చేసీ దర్యాప్తు చేపట్టారు.



