ఘనంగా రామన్నపేటలో సలేంద్రాలు

వేల్పూర్ మండలంలోని రామన్నపేటలో వర్షాలు కురవాలని అయ్యల గుట్ట ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సలేంద్రాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వేకువ జామునే తడపాకల్ గోదావరి నది నుండి పవిత్ర జలాల్ని తెచ్చి గ్రామంలోని అన్ని గ్రామ దేవతలు, దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి జలాభిషేకం చేశారు. గోదావరి జలాల్ని తెచ్చిన వారికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. పాటు మీది హన్మాన్ గుడి నుండి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా అయ్యలగుట్ట ఆలయ అభివృద్ధి కమిటి అధ్యక్షుడు రాజారపు శోభన్ మాట్లాడుతూ సకాలంలో వర్షాలు కురువకపోవడంతో వరునుడు కరుణించి వర్షాలు కురవాలనే సంకల్పంతో ఈ సలేంద్రాల కార్యక్రమాన్ని నిర్వహించాము. కార్యక్రమంలో అధ్యక్షుడు రాజారపు శోభన్, ఉపాధ్యక్షుడు గౌరి సంజీవ్, కోశాధికారి జంగిటి సాయన్న, సలహాదారులు ఎలుక శ్రీనివాస్ గౌడ్, కుర్మ నర్సయ్య, కమిటీ సభ్యులు, గ్రామదేవతల పూజారి ఎల్లాకర్ వివిధ కుల సంఘాల నుండి వచ్చిన మహిళలు, పురుషులు, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు