గంభీరావుపేటలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రవీందర్‌రావు జన్మదిన వేడుకలు…

గంభీరావుపేట జూలై 11(జనం సాక్షి); గంభీరావుపేట మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోఫ్యాక్స్ చైర్మన్ రవీందర్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు, ముందుగా మండల కేంద్రంలోని వీరాంజనేయ టెంపుల్ లో పూజలు నిర్వహించి, తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేసి, అంగన్వాడి సెంటర్లలో పిల్లలు ఆడుకునేందుకు బాలు, ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు బ్రెడ్ పంపిణీ నిర్వహించారు రవీందర్‌రావు ఆయురారోగ్యాలతో, దీర్ఘాయుష్షుతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు, ఉప సర్పంచ్ తో పాటు వార్డు సభ్యులు,పార్టీ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని రవీందర్‌రావుకు శుభాకాంక్షలు తెలిపారు



