ప్రశాంతంగా ముగిసిన చేనేత పారిశ్రామిక ఉత్పత్తి విక్రయ సంఘం ఎన్నికలు

శాయంపేట ,జూలై 10 (జనం సాక్షి) శాయంపేటలోని చేనేత పారిశ్రామిక ఉత్పత్తి విక్రయ సంఘం లో శుక్రవారం అధికారులు సునీల్ కుమార్, రవీంద్ర ,రమాదేవి, లక్ష్మయ్య ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మహిళా విభాగానికి నలుగురు పోటీ పడగా ఇద్దరు బాసని ఉమాదేవి వల్పదాసు స్వరూప విజయం సాధించినట్లు ప్రకటించారు. అదేవిధంగా ఓపెన్ కేటగిరిలో 14 మంది ఎన్నికల బరిలో ఉన్నట్లుగా తెలిపారు. ఇందులో నుండి ఏడుగురు సభ్యులు గెలుపొందినట్లు ప్రకటించారు. దిడ్డి రమేష్ ,బాసాని ప్రకాష్ ,సామల రవీందర్, వనం దేవరాజ్ ,బాసని నవీన్ ,దాసరి సమ్మయ్య, బాసని బాలకృష్ణ ,విజయం సాధించినట్లుగా ఎన్నికల అధికారి సునీల్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాయంపేట ఎస్సై పరమేశ్వర్ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.



