గంభీరావుపేట మండలంలో బీజేపీ ఆధ్వర్యంలో బండి సంజయ్ జన్మదిన వేడుకలు…

గంభీరావుపేట జూలై 11జనం సాక్షి); గంభీరావుపేట మండలంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కోడె రమేష్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి ఎంపీ బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా రామాలయంలో పూజలు నిర్వహించి, అమరుల సూపర్ వద్ద కేక్ కట్ చేశారు. ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేసి, బండి సంజయ్ దీర్ఘాయుష్షు, ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు, జిల్లా ధార్మిక క్షేత్ర జిల్లా కన్వీనర్ సత్యనారాయణ ,అధికార ప్రతినిధి దేవ సాని కృష్ణ, మైనార్టీ నాయకులు వాజిద్ హుస్సేన్, మాజీ అధ్యక్షులు గంట అశోక్, మల్లేష్ యాదవ్, రాజుగౌడ్ ,కృష్ణ కాంత్, నాగరాజు గౌడ్, సర్వోత్తమ్ దేవేందర్, బండ దేవయ్య, వివిధ గ్రామాల అధ్యక్షులు ప్రజాప్రతినిధులు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తాజావార్తలు