ఘనంగా ఊర పండుగ వేడుకలు
భీంగల్, జులై 11(జనం సాక్షి) భీంగల్ పట్టణం లో ఆది, సోమ వారాలలో ఊర పండుగ వేడుకలు అత్యంత భక్తి శ్రద్దలతో, సంస్కృతి, సాంప్రదాయాలతో ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా సర్వసమాజ్ అభివృద్ధి కమిటీ-భీంగల్, అధ్యక్షుడు కృష్ణ, కమిటీ సభ్యులు పత్రిక సమావేశము ద్వారా తెలిపారు. రెండు రోజులపాటు జరిగే ఈ పండుగలో పట్టణ ప్రజలు, యువతీ,యువకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.అలాగే ఆదివారం ఉదయం దేవుని విగ్రహ ఊరేగింపుతో పూజా కార్యక్రమాలు మొదలుకొని సోమవారం సాయంత్రానికి పండుగ వేడుకలు ముగుస్తాయని కమిటీ సభ్యులు తెలిపారు.



