ఎస్సైని మర్యాదపూర్వకంగా కలిసిన సర్పంచ్
పిట్లం ఏప్రి
ల్ 10 (జనం సాక్షి)మండలంలోని పిట్లం పోలీస్ స్టేషన్ కు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ఆంజనేయులు కు పిట్లం సర్పంచ్ కుమ్మరి చంద్రశేఖర్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్సై ఆంజనేయులు మాట్లాడుతూ పిట్లం గ్రామంలో శాంతిభద్రతలు కాపాడటమే తమ ప్రధాన లక్ష్యమని ప్రజల భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ గ్రామ ప్రజల సమస్యల పరిష్కారంలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తుందని ఎస్ఐ గారి సేవలు పిట్లం అభివృద్ధికి ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అవేజ్ పిఎసిఎస్ మాజీ చైర్మన్ శపథం రెడ్డి, ఇమ్రోజ్, నవీన్, మోయిన్, అశోక్, భూషణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు


