గర్భం వచ్చిందని వెళ్లగా.. గర్భ నిరోధక మాత్రలు ఇచ్చిన డాక్టర్

నల్లగొండ ప్రతినిధి,ఏప్రిల్28 (జనంసాక్షి) : నల్లగొండ జిల్లా గిరికబాయి గూడెంకు చెందిన కాకురాళ్ల కిరణ్మయి గర్భధారణ నిర్ధారణ అనంతరం నల్లగొండలోని వేణు విద్య మల్టీ స్పెషాలిటీ ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయించారు.బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం, గర్భం సురక్షితంగా కొనసాగేందుకు అవసరమైన చికిత్స ఇవ్వాల్సిన సమయంలో, సంబంధిత డాక్టర్ విద్యా భార్గవి గర్భ నిరోధక మాత్రలు సూచించడమే కాకుండా ప్రిస్కిప్షన్ రాయడం జరిగింది.ఈ ఘటనతో గర్భానికి నష్టం జరిగిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మూడు నెలలుగా అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ, సరైన వైద్య సేవలు అందలేదని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో డాక్టర్ వైద్య విధానం, అర్హతలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అదే సమయంలో, ప్రభుత్వ సేవలో ఉన్న వైద్యురాలు ప్రైవేట్ ప్రాక్టీస్ నిర్వహిస్తున్నారనే అంశం కూడా చర్చనీయాంశమైంది.ఆ డాక్టర్ ఎవరో కాదు విద్య భార్గవి.

అసలు ఎవరి డాక్టర్ విద్య భార్గవి?

నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న కానీ ఆమెకు ప్రయివేటు ఆసుపత్రి కూడా ఉంది.ఆమె రెండు చేతుల సంపాదనే లక్ష్యం తో పని చేస్తున్నట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈమె అటు ప్రభుత్వ డాక్టర్ గా చలామణి అవుతూ ప్రయివేటు గా ట్రీట్మెంట్ చేస్తుంది మరి అధికారులకు ఇది కనిపించడం లేదా లేక ఆమె వద్ద నుండి అధికారులకు పెద్ద ఎత్తున తాయిలాలు అందుతున్నాయని అందుకే మౌనం గా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

మనుషులను అన్నాక తప్పులు చేయమా?

ఇదే విషయం పైన డాక్టర్ విద్యా భార్గవి ని ఇలాంటి మందులు రాయడం ఏంటి అని ప్రశ్నిచగా మనుషులు అన్నాక తప్పు చేయమా అనుకోకుండా ఒకరికి రాయబోయి మీకు రాసిన అని నేను లీగల్ గా వెళ్తా అని పొగరుగా సమాధానం చెప్పింది అని అలాగే మరి ప్రాణం పోతే ఎలా అంటే సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయారు అని తెలిపారు. ఇదే విషయమై 2వన్ టౌన్ లో పిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.జిల్లా వైద్య శాఖ అధికారికి అలాగే డ్రగ్స్ అధికారికి పిర్యాదు చేస్తానని తెలిపారు. ఈ ఘటనపై సంబంధిత ఆరోగ్య శాఖ అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టి, నిజానిజాలు వెలికితీసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.అధికారిక వివరాలు, వైద్యుల స్పందన కోసం ఎదురుచూపులు చూస్తున్నారు మరి అధికారులు బాధితులకు బాసట గా నిలుస్తారా లేక తప్పుడు ప్రిస్కిప్షన్ రాసిన డాక్టర్ కి వంత పడుతారా ప్రయివేటు ఆసుపత్రులు పెట్టుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో జీతాలు తీసుకుంటూ ఉన్న వారి మీద కలెక్టర్ చర్యలు తీసుకుంటారా వేచి చూడాలి.

మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకునేనా?

ఈ వేణు విద్యా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా 5 అంతస్తులు నిర్మాణం చేసినట్లు స్పష్టం గా కనిపిస్తుంది అలాగే సీసీ రోడ్డు ను కబ్జా చేసి మరీ నిర్మణాలు చేసినట్లు ఉంది మరి మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకుంటారా లేదా వేచి చూడాల్సిందే.