ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు.

డిసెంబర్ 9(జనంసాక్షి):కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని వేడుకలను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశానుసారం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్టాండ్ కూడలిలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొయ్యడ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన దేవత సోనియా గాంధీ అని కొనియాడారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అభివృద్ధిలో దూసుకు పోతుందని అన్నారు. పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ ఎం సి చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి,పోరండ్ల సంతోష్,చిన్నల గొనాద్, మడికొండ శ్రీను,మడికొండ సంపత్,ఒంటెరు శ్రావణ్,దుబాసి వెంకటస్వామి,దా ర్న వేణుగోపాల్ ,పోరండ్ల వేణు,చందుపట్ల రాఘవరెడ్డి,మెరుగు శ్రీశేలం,పసుల రమేష్,నల్లెళ్ల అనిల్,మంద రాంచెందర్,బొచ్చు బాబు,లడే శ్రీకాంత్, పంచగిరి జయ్యమ్మ,పసుల విజయ,కోమలా,బొచ్చు భాస్కర్,దొమ్మటి బాబురావు,గొట్టే రమేష్,లక్కం వసంత,బొచ్చు అనంత్,జంగిలి సతీష్,గడ్డం శివకుమార్,బొచ్చు మోహన్, తదితరులు పాల్గొన్నారు..



