ఆర్యవైశ్య మహాసభ అసోసియేట్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా తడక లింగమూర్తి

చేర్యాల పట్టణ ఆర్యవైశ్య మహసభ ఆధ్వర్యంలో సన్మానం

చేర్యాల (జనంసాక్షి) జూన్ 07 : తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అసోసియేట్ కార్యవర్గ సభ్యులుగా తడక లింగమూర్తి గుప్తా నియమితులయ్యారు. వారి ఎన్నిక పట్ల చేర్యాల పట్టణ ఆర్యవైశ్య మహసభ అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ గుప్త ఆధ్వర్యంలో స్థానిక వైశ్యభవనంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తడక లింగమూర్తి మాట్లాడుతూ.. ఆర్యవైశ్యులు ఎదుర్కొంటున్న సమస్యల సాధన కోసం తన వంతు కృషి చేస్తూ సంఘం నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేస్తానని అన్నారు. తమకు సహకరించిన రాష్ట్ర సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వంగపల్లి వెంకటేశం, మంచాల ఆంజనేయులు, పట్టణ ప్రదాన కార్యదర్శి ఉప్పల నాగరాజు , కోశాధికారి తెరాల శ్రీనివాస్,ఉపాధ్యక్షులు అయిత రవీందర్, పీఆర్ఓ శేరి బాలనారాయణ, మహిళా విభాగం అధ్యక్షురాలు తోట పధ్మ , ఆవోపా అధ్యక్షులు గందె నర్సింహులు , సెక్రెటరీ తోట పరమేశ్వర్, కిరాణ వర్తక సంఘం ఉపాధ్యక్షులు మంకాల రాజు, ప్రదాన కార్యదర్శి అయిత లింగం, బచ్చు రమేష్, యాంసాని లక్ష్మణ్,పిన్న వీరమల్లయ్య, నాళ్ల లక్ష్మణ్, దిడిగం నర్సింహులు, పెద్ది రమేష్, పెద్ది అంజయ్య, యాంసాని కృష్ణమూర్తి,నీల బాలరాజు, పిన్న మౌళి, మంచాల నారాయణ, తదితరులు పాల్గొన్నారు.