బిఆర్ఎస్ నాయకులు మన్యం వెంకట్ రెడ్డి విగ్రహావిష్కరణకు హరీశ్‌రావు రాకతో గులాబీమయమైన మండల కేంద్రం.

మిడ్జిల్: జూన్ 29.( జనం సాక్షి) మిడ్జిల్ మాజీ సర్పంచ్ మన్యం రాధిక భర్త, దివంగత మన్యం వెంకట్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా మంగళవారం నిర్వహించనున్న వెంకట్‌రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు రావడంతో మిడ్జిల్ మండల కేంద్రం గులాబీమాయంగా మారింది విగ్రహావిష్కరణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రావలసింది ఉండగా వైరల్ ఫీవర్ కారణంగా హాజరు కాలేకపోతున్నారని పార్టీ నాయకులు తెలిపారు. ఆయన స్థానంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీశ్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. అని మండల పార్టీ అధ్యక్షుడు పాండు యాదవ్, మాజీ ఎంపీపీ సుదర్శన్ బరిగెల, మాజీ జడ్పీటీసీ శశిరేఖా బాలు, నాయకులు జంగా రెడ్డి, జైపాల్ రెడ్డి, గంజి కృష్ణ, సర్పంచ్‌లు శ్రీనివాస్ గౌడ్, గోపాల్ ముదిరాజ్, నాయకుడు జగన్ గౌడ్ ఈ విషయాన్ని వెల్లడించారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.హరీశ్‌రావు రాక నేపథ్యంలో మిడ్జిల్ మండల కేంద్రంతో పాటు జడ్చర్ల–కల్వకుర్తి జాతీయ రహదారి ఇరువైపులా గులాబీ జెండాలు, భారీ బ్యానర్లు, ఫ్లెక్సీలతో ప్రత్యేక అలంకరణలు చేశారు. కార్యక్రమానికి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి భారీగా నాయకులు, కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉండటంతో మండల కేంద్రంలో రాజకీయ సందడి నెలకొంది. పోలీసులు ట్రాఫిక్, భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. రహదారిపై వాన దారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీస్ సిబ్బంది చర్యలు చేపట్టారు.

తాజావార్తలు