వైభవంగా వీర హనుమాన్ విజయ యాత్ర
వరంగల్ బ్యూరో ,ఏప్రిల్ 02 (జనం సాక్షి)వీర హనుమాన్ జన్మదినం సందర్భంగా గురువారం సాయంత్రం వరంగల్ నగరంలోని రంగసాయిపేట శ్రీ మహంకాళి దేవాలయ రంగం నుండి వీర హనుమాన్ విజయ యాత్ర వైభవంగా కొనసాగింది. విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ వరంగల్ మహానగర్ ఆధ్వర్యంలో కాషాయ జెండాలు పట్టుకున్న హిందువులంతా బైక్ ర్యాలీ నిర్వహించారు. రంగసాయిపేట నుండి ఉరుసు కరీమాబాద్, సాకరాశి కుంట, వరంగల్ పోస్ట్ ఆఫీస్, వెంకటరామ జంక్షన్ నుండి కాశిబుగ్గ, పోచం మైదాన్ ఎంజీఎం మీదుగా హనుమకొండకు ర్యాలీ కొనసాగింది. అదేవిధంగా హైగ్రీవ చారి గ్రౌండ్ వరకు సాగిన ఈ ర్యాలీలో వేలాదిమంది హిందువులంతా బైక్ ర్యాలీతో ఉత్సాహాన్ని నింపారు. జైశ్రీరామ్ జై హనుమాన్ అంటూ తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా సిద్ధయోగి శ్రీ చైతన్యానంద మహారాజ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సనాతన ధర్మాన్ని కాపాడుకోవడంలో ప్రతి హిందువు ఒక శక్తిగా మారాలన్నారు. వీర హనుమాన్ శక్తి సామర్థ్యాలను భక్తిని సేవను ప్రతి ఒక్క హిందువు ఆచరించాలన్నారు. అనంతరం సమీపంలోని శ్రీ మహంకాళి దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వీర హనుమాన్ విజయ యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ ఇతర హిందూ సేవకులు ఆకారపు కేశవరాజు, కేశిరెడ్డి జయపాల్ రెడ్డి, ఎలగందుల రాజు, నందాల చందర్ బాబు, శివరాంజి, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ర్యాలీ లో ఎక్కడ ఎలాంటి ఆలోచనయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.


